Site icon NTV Telugu

Eagle OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా ‘ఈగల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Eegale

Eegale

తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు..

ఇకపోతే ఈ సినిమా కథ నచ్చడంతో సినిమా ఇప్పటివరకు బాగానే రన్ అవుతుంది.. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ రవితేజ ఈగల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తుంది.. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ రవితేజ ఈగల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. ఈ విషయాన్ని స్వయంగా ఈటీవీ విన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. అయితే సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో జర్నలిస్ట్ రాసిన ఓ వ్యక్తి స్టోరీ ఆధారంగా సినిమా మొదలవుతుంది.. ఆర్టికల్ పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. అయితే ఈ నెట్ వర్క్ ను సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతుంటాడు.. ఈ నెట్ వర్క్ అందరికీ టార్గెట్ అవుతుంది.. ఈగల్ నెట్ వర్క్.. ఆ అడవులకు సంబంధం ఏంటీ ?.. అసలు సహదేవ్ వర్మ ఎవరు ?..ఈ సినిమా కథ..

Exit mobile version