NTV Telugu Site icon

DELHI: ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్, అస్తవ్యస్తమైన జనజీవనం

New Project (5)

New Project (5)

ప్రపంచంలోని కాలుష్య న‌గ‌రాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీలో శుక్రవారం సాయంత్ర దుమ్ము తుఫాన్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దుమ్ము తుఫాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై విజిబిలిటీ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో ముందు ఏమీ కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెటియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎండీ) అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇది ఎన్‌సీఆర్‌లో మండుతున్న వేడితో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం, సాయంత్రం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

READ MORE:Police Case: కేంద్ర మంత్రి కుమారుడితోపాటు ముగ్గురిపై కేసు నమోదు..

కాగా.. గత మే నెలలో కూడా ఢిల్లీని దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. అప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజ‌ధాని న‌గ‌రం దుమ్ము తుఫానుతో భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తుంది. తీవ్రమైన‌ దుమ్ము తుఫాను, బలమైన గాలులు దేశ రాజధానిని తాకడంతో ఢిల్లీ వాతావరణంలో పెను మార్పు సంభ‌వించింది. దుమ్ము తుఫాను దేశరాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని కుదిపేసింది. గతంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది.
Dust storm, Delhi, once again, chaotic life, latest news