NTV Telugu Site icon

Nani : దసరా కాంబినేషన్ రిపీట్.. హీరోయిన్ ఎవరంటే..?

Nani (1)

Nani (1)

Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,సాంగ్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 29 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Darling : ప్రియదర్శి ‘డార్లింగ్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ సినిమా తరువాత నాని స్టార్ డైరెక్టర్ సుజీత్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు.బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ సినిమా హోల్డ్ లో పడింది.ఇదిలా ఉంటే నాని మరోసారి తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా నాని కెరీర్ లో 33 వ సినిమాగా తెరకెక్కుతుంది..దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.దసరా సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ నే ఈ సినిమాలో తీసుకుంటారా లేక మరో హీరోయిన్ ను తీసుకుంటారా అనేది తెలియాల్సి వుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ,సాయి పల్లవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.వీరిద్దిరిలో ఎవరొకరిని మేకర్స్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

Show comments