NTV Telugu Site icon

Beijing: మరో యుద్ధ నౌకను సిద్ధం చేసిన డ్రాగెన్.. భారత్ కు ప్రమాదం పొంచి ఉందా..?

Dragen

Dragen

డ్రాగెన్ నౌకాదళ శక్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్‌ను రంగంలోకి దించింది. అమెరికాకు ధీటుగా ఎలకోట్రమ్యాగ్నెటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి తెచ్చింది.ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా విమానవాహక యుద్ధ నౌక ‘యూఎ్సఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’లో మాత్రమే ఉన్న ‘ఈమాల్స్‌ (ఎలకోట్రమ్యాగ్నెటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌)’తో చైనా దీన్ని రూ పొందించడం విశేషం.

READ MORE: Maharashtra: మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మహిళలు..

మే1న ఈ ఫ్యూజియాన్‌ సీ ట్రయల్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ యుద్ధనౌకలోని ప్రొపల్షన్‌, విద్యుత్‌ వ్యవస్థల పనితీరు, స్థిరత్వాన్ని చైనా రెండేళ్లు పరీక్షించింది. ఐదేళ్లలో తన నౌకాదళానికి అందుబాటులోకితేనుంది. దీని బరువు దాదాపు 80వేల టన్నులు. పొడుగు 1036అడుగులు. ఫ్యూజియాన్‌కన్నా ముందు చైనా వద్ద 2 విమాన వాహక యుద్ధనౌకలున్నాయి. మొదటిది.. లియావోనింగ్‌. 1998లో చైనా దీన్ని ఉక్రెయిన్‌ నుంచి కొని మార్పుచేర్పులు చేసుకుంది. 2019లో షాంగ్‌డాంగ్‌ అనే దేశీయ విమాన వాహక యుద్ధనౌకను తన నేవీకి అందుబాటులోకి తెచ్చింది. విమానం టేకాఫ్ కావాలంటే కచ్చితంగా రన్ వే అవసరం. యుద్ధనౌకపై అంతపెద్ద రన్‌వే ఉండదు కాబట్టి వాటిపై నుంచి యుద్ధవిమానాల టేకాఫ్కు స్టోబార్‌, క్యాటోబార్‌ విధానాలను అనుసరిస్తారు. స్టోబార్‌ అంటే షార్ట్‌ టేకాఫ్‌ బ్యారియర్‌ అరెస్టెడ్‌ రికవరీ విధానం. ఇందులో యుద్ధనౌక చివర్లో రన్‌వే కొంత పైకి లేచినట్టు ఉంటుంది.

చైనా – భారత్ మధ్య ఎప్పుడూ వివాదాలే తప్ప ఒప్పందాలు లేవు. కాగా గత 3 దశాబ్దాలుగా హిందూ మహాసముద్రంపై కన్నేసి విస్తృత కార్యకలాపాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది డ్రాగెన్. భారతదేశ క్షిపణి పరీక్షలను అతి దగ్గర్నుంచీ పరిశీలిస్తూ పక్కలోబల్లెంలా తయారైందని పలువురు అంటున్నారు. విమానవాహక యుద్ధనౌకల విషయంలో చైనా, భారత్‌ సమానంగా ఉన్నాయి. చైనా వద్ద 2 ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు ఉంటే.. భారత్ వద్ద 2 (ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య, ఐఎన్‌ఎ్స విక్రాంత్‌) విమానవాహక యుద్ధనౌకలున్నాయి. ఇప్పుడు ‘ఈమాల్స్‌’తో చైనా మూడో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను రంగంలోకి దించడం భారత్‌కు ఆందోళన కలిగించేదే. 2035నాటికి ఇదే తరహాలో విద్యుదయస్కాంత శక్తితో యుద్ధవిమానాలను లాంచ్‌ చేయగల మరో 3 విమానవాహక యుద్ధ నౌకలను తననౌకాదళానికి అందుబాటులోకి తేవాలన్నది చైనా లక్ష్యం. అదే జరిగితే డ్రాగెన్ మరింత శక్తి వంతంగా మారుతుందన్న వాదనలు వినబడుతున్నాయి.