NTV Telugu Site icon

Drinking Water: రోజూ రెండు లీటర్ల నీరు త్రాగాల్సిన అవసరం ఉందా?

Drinking Water

Drinking Water

Drinking Water: ఒక వ్యక్తి ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు త్రాగాలని వైద్యులు, నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తూనే ఉంటారు. అయితే ఓ అధ్యయనం ప్రకారం రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు చాలా ఎక్కువ కావచ్చని అంటున్నారు. ఇది హానికరం కానప్పటికీ.. చాలా సందర్భాల్లో అన్ని గ్లాసుల నీరు అవసరమని ఆ అధ్యయనం పేర్కొంది.

అబెర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఇతర పరిశోధకులతో కలిసి ప్రజలు నిజంగా ఎంత నీరు త్రాగాలి అనే విషయంపై స్టడీ చేశారు. వారు 23 వేర్వేరు దేశాల నుంచి 5,604 మందిని పరిశీలించారు. ఎనిమిది ఏళ్ల నుంచి 96 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిని పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం రోజుకు 1.5 నుంచి 1.8 లీటర్లు మాత్రమే అవసరమవుతాయని తెలిసింది. సాధారణంగా సిఫార్సు చేయబడిన రెండు లీటర్ల కంటే తక్కువ. నీరు ఎక్కువగా త్రాగితే, అది ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీని వల్ల తరచుగా మూత్రవిసర్జన, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం, వికారం, చేతులు, కాళ్ల రంగులో మార్పు, కండరాల తిమ్మిరి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఉన్నాయి.

మన వయస్సు, శారీరక శ్రమ, ఉష్ణోగ్రత, శరీర బరువుపై మనం ఎన్ని నీళ్లు తాగాలో ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది.వాతావరణం వేడిగా ఉంటే, వ్యాయామం చేస్తుంటే వాటర్ క్వాంటిటీ ఇంకా పెంచాలి. ఒక ఆరోగ్యకరమైన మనిషి ఒక రోజులో 2-3 లీటర్ల నీరు త్రాగాలి. వేడి, తేమతో కూడిన వాతావరణంలో, ఎత్తైన ప్రదేశాలలో నివసించే వ్యక్తులు, అలాగే అథ్లెట్లు, గర్భిణీ. పాలిచ్చే మహిళలకు నీటి టర్నోవర్ ఎక్కువగా ఉన్నందున వారికి ఎక్కువ నీరు అవసరమని నివేదిక సూచిస్తుంది. పరిశోధన ప్రకారం, 20-35 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు రోజుకు సగటున 4.2 లీటర్లు, 20-40 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు 3.3 లీటర్లు తాగినట్లు పరిశోధకులు వెల్లడించారు.

Weather In Telangana: మరో రెండు రోజులు చలితో వణకాల్సిందే..

అబెర్డీన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ జాన్ స్పీక్‌మాన్ మాట్లాడుతూ.. రోజుకు రెండు లీటర్ల నీరు అవసరం లేదన్నారు. మనం తాగాల్సిన నీరు మనం తీసుకునే ఆహార పదార్థాలపై కూడా ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తి 20 కిలోల బరువును బట్టి ఒక లీటరు నీటిని తాగాలని అనేక పరిశోధనలలో వెల్లడైందన్నారు. ఉదాహరణకు, మీరు 70 కిలోల శరీర బరువు ఉంటే, అప్పుడు 20 కిలోలకు లీటర్ చొప్పున 3.5 లీటర్ల నీరు త్రాగాలన్నారు. 80 కిలోలు ఉంటే, 4 లీటర్ల నీరు తాగాలి.