NTV Telugu Site icon

Chandra Mohan Death: నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan Died

Chandra Mohan Died

Chandra Mohan Death: సీనియర్ నటుడు, హీరో చంద్రమోహన్ హృద్రోగ సమ్యసలతో శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల వయసు కల్గిన ఆయన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనను చివరసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు, సినీ ప్రముఖులు వెళ్తున్నారు. నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటిలో నిర్వహించబోతున్నారు. శనివారం చనిపోయిన ఆయనకు సోమవారం అంటే మూడ్రోజులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారని చాలా మందికి డౌట్ వస్తోంది. అయితే ఇలా ఆలస్యంగా చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

Read Also:Koti Deepotsavam 2023: రేపటి నుంచే ‘కోటిదీపోత్సవం’.. ముస్తాబైన ఎన్టీఆర్‌ స్టేడియం

చంద్రమోహన్ భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఆమె సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె మాధవి చెన్నైలో సెటిల్ అయ్యారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి మాత్రం అమెరికాలో ఉంటున్నారు. అయితే ఆవిడ తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి కాస్త సమయం పట్టింది. కాబట్టి రెండు రోజులు ఆలస్యంగా ఈయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆదివారం దీపావళి పండగ. దీపావళికి ఒక్క రోజు ముందే చంద్రమోహన్ చనిపోవడం నిజంగా బాధాకరమే. పండుగ వదిలిపెట్టుకొని అంత్యక్రియలకు వెళ్లేందుకు ఎవరూ ఎక్కువగా ఇష్టపడరు. అందులోనూ చాలా దగ్గరి వాళ్లు, ఇక తప్పదు అనుకున్న వాళ్లు మాత్రమే వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల చాలా మంది అభిమానులు కూడా ఆయనను కడసారి చూసేందుకు రాలేరని భావించి అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలనుకున్నారట. పండుగ తర్వాతి రోజు అయితే చూడాలనుకున్న వాళ్లంతా వస్తారు. ఈ రెండు కారణాలతో చంద్రమోహన్ అంత్యక్రియలను నేడు నిర్వహిస్తున్నారు.

Read Also:Kohli-Anushka: ఏంటి అనుష్క.. కనీసం చప్పట్లు కూడా కొట్టావా! కోహ్లీ వీడియో వైరల్