NTV Telugu Site icon

Game Changer : రామ్ చరణ్ చేతిలో వున్న ఆ పుస్తకం ఏమిటో తెలుసా..?

Whatsapp Image 2024 03 26 At 2.05.02 Pm

Whatsapp Image 2024 03 26 At 2.05.02 Pm

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇందులో నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చేతిలో పట్టుకున్న పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రముఖ రచయిత చలం రాసిన ‘ప్రేమ లేఖలు’ పుస్తకం. ఆ పుస్తకానికి, పోస్టర్లోని బ్యాక్ గ్రౌండ్ కి సంబంధం లేదు. అయితే ఇది ఒక లవ్ సాంగ్ అని చెప్పడానికి పోస్టర్ లో ఆ పుస్తకాన్ని చూపించి ఉండవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ పుస్తకం గురించి ప్రజంట్ యూత్ కి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు ప్రేమకథల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘ప్రేమ లేఖలు’.

ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఒక కాల్ చేస్తే సరిపోతుంది..ఇప్పుడైతే అది కూడా అవసరం లేదు అనుకుంటే ఒక్క మెసేజ్ పెడితే చాలు.. కానీ ఒకప్పుడు ప్రేమించిన వారితో మాట్లాడడానికి ప్రేమలేఖలు మాత్రమే మాధ్యమంగా ఉండేవి. అలాంటి ప్రేమలేఖల ప్రాముఖ్యతను తెలియజేసిన పుస్తకమే చలం రాసిన ‘ప్రేమ లేఖలు’. 1986లో విడుదలయిన ఈ పుస్తకం.. ప్రేమలేఖల గొప్పదనాన్ని, ప్రేమను వ్యక్తం చేసే విధానాన్ని వివరిస్తుంది. ఇక అప్పటి పుస్తకం ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ నుంచి విడుదలయిన రామ్ చరణ్ పోస్టర్ లో ఉండడమేంటని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అని ఉహించుకుంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలం అయ్యింది. అయితే ఈ షూటింగ్ ప్రారంభమయిన మొదట్లో లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. దాన్ని బట్టి చూస్తే హీరో ఇందులో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.