NTV Telugu Site icon

Tamannah : తమన్నా తీసుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?

Whatsapp Image 2023 06 09 At 12.25.35 Pm

Whatsapp Image 2023 06 09 At 12.25.35 Pm

తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. మంచు మనోజ్ నటించిన శ్రీ తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. మొదటి సినిమా లో అందంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపును సంపాదించింది.ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ తోపాటు..బాలీవుడ్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు కన్నడం, తమిళ్ మరియు హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలను అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 ఏళ్లను పూర్తిచేసుకుంది తమన్నా..

అయితే తమన్నా కెరీర్ మొదట్లో పలు యాడ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం తమన్నా అందుకుంటున్న రేమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల వరకు అయితే ఉంది. అలాగే ఆమె యాడ్స్ కోసం ప్రస్తుతం 4 కోట్ల వరకు అయితే అందుకుంటుంది. అయితే కెరీర్ బిగినింగ్ లో తమన్నా అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటేతమన్నా అందుకున్న మొదటి పారితోషకం లక్ష రూపాయిలని సమాచారం.2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేస్తే లక్ష రూపాయల పారితోషికం అందుకుందట తమన్నా. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది.తాను వరుసగా భారీ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం తాను చిరంజీవి హీరోగా వస్తున్నా భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఆ సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే తాను నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ కూడా విడుదల అయింది. త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో తమన్నా కొంత బోల్డ్ గా కనిపించింది.