NTV Telugu Site icon

Karthi -Mahesh Babu : త్వరలో మహేశ్, కార్తీ కాంబోలో సినిమా.. ?

New Project (41)

New Project (41)

Karthi -Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గె్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా రాజమౌళి సంగతి మనకు తెలిసిందే. ఆయన సినిమా తీస్తే కనీసం నాలుగైదు ఏళ్లు అయినా పడుతుంది. సినిమాలో చిన్న లోపం కూడా లేకుండా చూసుకునే ఆయన.. సూపర్ స్టార్ తో సినిమా అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వీరి కాంబోలో సినిమా చూడాలంటే మాత్రం మరో నాలుగేళ్లు ఆగాల్సిందేమో. ఎప్పుడు వచ్చినా ఆ సినిమా మాత్రం ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం మాత్రం పక్కా. అలాంటి సినిమాలో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంటుందనడంతో సందేహం లేదు. పలు భాషలకు చెందిన అనేకమంది బిగ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.

Read Also:OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు

ఇది ఇలా ఉంటే మహేశ్ బాబు పలు మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలా మరో సారి మహేశ్ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడా అంటే.. కొంతమంది అవునన్న సమాధానం చెబుతున్నారు. పైగా మహేష్ తో సినిమాపై కోలీవుడ్ యువ హీరో కార్తీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also:Mynampally Hanumantha Rao: మైనంపల్లి ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా?

తానూ.. మహేశ్ బాబు చిన్నపుడు ఒకే క్లాస్ లో చదువుకున్నామని.. ఆయనతో గనుక సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని మంచి కథ కుదరాలంటూ కార్తీ తెలిపాడు. దీనితో ఈ ఇద్దరి కలయికలో సినిమా సహా వారి చిన్నపుడు విషయాలు కూడా బయటకు వచ్చాయని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా కార్తీ నటించిన “సత్యం సుందరం” సినిమా తమిళ్ సహా తెలుగులో మంచి హిట్ అయింది. దీంతో విజయవాడలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది కార్తీ టీం. ఈ ప్రెస్ మీట్ లో కార్తీ ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. కార్తీ చాలా మందికి తెలియని సర్‌ప్రైజ్‌ విషయం చెప్పడంతో ఎక్జయిట్‌కు లోనవుతున్నారు అభిమానులు. మరోవైపు కార్తీ సర్దార్‌ 2తోపాటు పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

Show comments