Site icon NTV Telugu

DK Shivakumar: అసెంబ్లీలో ఆర్‌ఎస్ఎస్ ప్రార్థనాగీతాన్ని పాడిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం(వీడియో)

Dk

Dk

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటపై చర్చ సందర్భంగా డీకే శివకుమార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రార్థనలోని కొన్ని వ్యాక్యాలను పాడారు. కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వచ్చిన ఈ పంక్తులను విన్న అసెంబ్లీ లోపల ఉన్న నాయకులందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ రాష్ట్రాధినేత నోటి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రార్థనాగీతం రావడం ఏంటని విస్తుపోయారు.

READ MORE: Minister Nara Lokesh: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..

ఆర్‌సీబీ విజయం తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనకు శివకుమార్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. దీనికి ఆయన సమాధానమిచ్చారు. బెంగళూరు ఇన్‌ఛార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్‌ అసోషియేషన్‌ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని ఆయన డీకే వివరణ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్‌ను ముద్దాడాక అక్కడితోనే తన పని అయిపోయిందని చెప్పారు. అదే సమయంలో ఇలాంటి ఘటనలు వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయని.. కావాలంటే చదివి వినిపిస్తానన్నారు.

READ MORE: woman raped by fake baba: దెయ్యం పేరు చెప్పి అత్యాచారం.. దొంగ బాబా అరాచకం

ఇంతలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్‌ చెడ్డీ (యూనిఫాం) వేసుకున్నానని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి స్పందించిన డికే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రార్థనా గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే… త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం..” అంటూ పాడసాగారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. అసెంబ్లీలో ఉన్న మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సరిగ్గా రియాక్ట్ కాలేదు. మౌనంగా ఉండిపోయారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

READ MORE: woman raped by fake baba: దెయ్యం పేరు చెప్పి అత్యాచారం.. దొంగ బాబా అరాచకం

వాస్తవానికి.. కాంగ్రెస్‌కు ఆర్ఎస్ఎస్ అంటే ముందు నుంచే అస్సలు ఇష్టం లేదు. అగ్రనాయకులు సైతం ఆర్ఎస్ఎస్‌ను విమర్శిస్తుంటారు. ఈ సంఘానికి వ్యతిరేకంగా పోరాటాలు సైతం జరిపారు. కాంగ్రెస్ హయాంలో పలు మార్లు ఈ సంఘాన్ని భారత్‌లో బ్యాన్ చేశారు. ప్రార్థనలు చేయనివ్వలేదు. ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ ను పంద్రాగస్టున ఎర్రకోట వేదికగా మోడీ కొనియాడారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

Exit mobile version