బాలీవుడ్ తను వెడ్స్ మనుతో హిట్ పెయిర్‌గా మారారు కంగనా రనౌత్ అండ్ మాధవన్. 2011లో వచ్చిన ఈ ఫిల్మ్స్ కు సీక్వెల్‌గా 2015లో తను వెడ్స్ మను రిటర్న్ అనే మూవీ వచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోవడంతో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తను వెడ్స్ మను3కి ప్లాన్ చేశాడు. కంగనా క్వీన్2 కంప్లీట్ చేయగానే ఈ ప్రాజెక్టుకి షిఫ్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Coolie : కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిందిగా.. ఎక్కడ చూడాలంటే..
తను వెడ్స్ మను సినిమాకు సంబంధించిన హక్కులన్నీ తమవేనంటూ తమ అనుమతి లేకుండా సీక్వెల్స్ ప్లాన్ చేయకూడదని ఆనంద్ ఎల్ రాయ్‌కి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ నోటీసులు జారీ చేసినట్లు నార్త్ బెల్ట్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దర్శకుడు ఈరోస్‌కు మధ్య విబేధాలకు కారణమైంది రంఝానా రీ రిలీజ్ అని తెలుస్తోంది. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రంఝనాను ఈరోస్ ఇంటర్నేషనలే డిస్రిబ్యూట్ చేసింది. అయితే రీసెంట్లీ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. హిందీలో క్లైమాక్స్ యాజ్ టీజ్‌గా ఉంచేస్తే తమిళంలో ఏఐ టెక్నాలజీ వినియోగించిన మార్చేశారు. దీనిపై హీరో ధనుష్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఘాటుగా స్పందించారు. ఇది మంచి పరిణామం కాదు అంటూ బహిరంగంగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదే పర్సనల్‌గా తీసుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు తను వెడ్స్ మను3కి ఇలా లింక్ చేసి ప్రాజెక్టుపై అడుగు ముందుకు పడకుండా నోటీసులిచ్చిందని బజ్. మరీ ఈ వివాదాన్ని ఆనంద్ ఎల్ రాయ్ ముగిస్తాడా లేదా ప్రాజెక్టు నుండి తప్పుకుంటాడా కంగనా-మాధవన్ తిరిగి నటించే ఛాన్స్ ఉందా అనేది తేలడానికి ఇంకొంచెం టైమ్ పట్టేట్టుగానే కనిపిస్తోంది.
