Dipendra Singh Hits Fifty in 9 Balls, Breaks Yuvraj Singh’s T20I Fastest Fifty Record: భారత మాజీ బ్యాటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2007లో నెలకొల్పిన యువరాజ్ రికార్డును నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా దీపేంద్ర నిలిచాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
టీ20 ప్రపంచకప్ 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడమే కాకూండా.. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. తాజాగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ.. యువీ రికార్డును బ్రేక్ చేశాడు. దీపేంద్ర 9 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. 9 బంతుల్లో 8 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో దీపేంద్ర 10 బంతుల్లో 8 సిక్స్‌లతో 520 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Also Read: Viral Video: ఇంట్లోకి రాబోయి కిటికీలో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. వీడియో వైరల్
ఇక నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 34 బంతుల్లోనే కుశాల్ శతకం పూర్తి చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్, కుశాల్ మల్లా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నేపాల్ రికార్డుల్లో నిలిచింది.