NTV Telugu Site icon

Hanuma Vihari: ఇది రివర్స్ స్వీప్ కాదు, రివర్స్ స్లాప్..విహారి సింగిల్ హ్యాండ్ షాట్

Vih

Vih

హనుమ విహారి..ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోన్న పేరు. విహారికి ఆటపట్ల ఉన్న అంకిత భావం అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్ పేసర్లు విసురుతున్న బుల్లెట్లలాంటి బంతులకు తన శరీరాన్నే అడ్డుగా పెట్టి వీరోచితంగా పోరాడాడు. ఇక తాజాగా రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తన ఎడమ చేతి మణికట్టు విరిగినా కూడా ఒంటి చేత్తో ఫైట్ చేయడం చూశాం. తాజాగా అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు అలాగే మొండిగా బ్యాటింగ్‌కు దిగాడు. అంతేకాదు ఆ ఒంటిచేత్తోనే మూడు ఫోర్లు కొట్టాడు. అందులో ఒకటి రివర్స్ స్వీప్ కూడా ఉండటం విశేషం. ఈ షాట్ చూసిన టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. అది రివర్స్ స్వీప్ కాదు రివర్స్ స్లాప్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఆంధ్ర ఓటమి..

అయితే విహారి ఎంత పోరాటం చేసినా ఈ మ్యాచ్‌లో ఆంధ్రా టీమ్ చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 రన్స్ చేసింది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో మెరిశారు. అనంతరం ఎంపీని 228 రన్స్‌కే ఆలౌట్ చేసిన ఏపీ మొదటి ఇన్నింగ్స్‌లో 151 రన్స్ ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదింగి విజయం సాధించింది. యశ్ దూబే (58), రజత్ పటిదార్ (55) హాఫ్ సెంచరీలతో మెరిసి ఎంపీకి విజయాన్ని అందించారు.

Also Read:INDvsAUS Test: అశ్విన్ కోసం ఆసీస్ డూప్లికేట్ వ్యూహం..అచ్చు అశ్విన్ లానే!