NTV Telugu Site icon

Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?

Manamey (2)

Manamey (2)

Manamey Twitter Review :టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే”.టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా నుండి రిలీజ్ అయినా పోస్టర్స్ ,టీజర్ ,ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ జూన్ 6 నుంచే వేయడం జరిగింది.అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఎంతో స్లో గా సాగుతుంది అని.. చూసే ప్రేక్షకులకు ఎంతో బోరింగ్ కలిగించిందని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also :Game Changer : ఎట్టకేలకు “గేమ్ ఛేంజర్” షూటింగ్ పూర్తి కాబోతుందిగా..

ఈ సినిమాలోని కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా కథ మొత్తం కూడా హీరో ,హీరోయిన్ ,ఓ చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో శర్వానంద్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన సెకండ్ హాఫ్ తేలిపోయినట్లుగా సమాచారం.ఈ సినిమాలో హీరో ,హీరోయిన్ మధ్య ఎమోషనల్ కనేక్టివిటిని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో హీరో శర్వానంద్ ,పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కూడా అంత ఇంటెన్సివ్ గా లేకపోవడంతో ప్రేక్షకులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది.