Site icon NTV Telugu

Word of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ’67’..ఎందుకంటే..?

Word Of The Year 67

Word Of The Year 67

Word of the Year: ప్రతి సంవత్సరం డిక్షనరీ.కామ్ (Dictionary.com) ప్రకటించే వర్డ్ ఆఫ్ ది ఇయర్ (Word of the Year) జాబితాలో ఈసారి ఒక సంఖ్యకి చోటు దక్కింది. అదే “67”. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఒక సంఖ్యే ఈసారి వర్డ్ ఆఫ్ ది ఇయర్ పదంగా ఎంపికైంది.

Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ..? ఎంఐ పోస్టుతో మొదలైన రచ్చ..!

“67” అంటే ఏమిటి?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యంగా టిక్ టాక్, మీమ్స్ లో “67” అనే పదం 2024 చివరి నాటికి ఒక స్లాంగ్‌గా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. జెన్ ఆల్ఫా (Gen Alpha) అనే కొత్త తరానికి ఇది ఓ మంత్రంలా మారింది. ముఖ్యంగా పాఠశాలల్లో, చాట్‌లలో, వీడియోల్లో ఎక్కడ చూసినా “67” అనేది వినిపించేది. ఈ స్లాంగ్ మొదటగా స్క్రిల్లా (Skrilla) అనే సంగీత కళాకారుడు రూపొందించిన “Doot Doot (6 7)” అనే పాట నుంచి పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. ఆ పాట తర్వాత బాస్కెట్‌బాల్ మీమ్స్, ది 67 కిడ్ పేరుతో వైరల్ అయిన పిల్లవాడు వంటి అనేక సన్నివేశాలు ఈ పదాన్ని గ్లోబల్ ట్రెండ్‌గా మార్చాయి.

BSNL దెబ్బకి జియో, ఎయిర్‌టెల్‌ విలవిలా.. చౌక ధరకే 6 నెలల, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు..!

డిక్షనరీ.కామ్ ప్రకార “67” అనేది ఒక అర్థం లేకపోయినా, అందరికీ అర్థమయ్యే పదం అని పేర్కొంది. ఇది సాధారణంగా so-so, ఏదో మధ్యస్థం వంటి భావాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే, దీని అసలు అర్థం అస్పష్టతగా ఉంది. “67” అనేది ఒక నిర్దిష్ట అర్థం లేని, సందర్భానుసారం మారే పదంగా మారింది. మొత్తానికి, ఈ “67” అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది జనరేషన్ ఆల్ఫా తమదైన రీతిలో ప్రపంచాన్ని ఎలా నిర్వచిస్తుందో తెలిపే భాషా ప్రకటన. ఇది ఒక ట్రెండ్ మాత్రమే కాదు.. డిజిటల్ కమ్యూనికేషన్‌లో కొత్త మలుపు.

Exit mobile version