Vijayawada Diarrhea: విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధ్యతల సంఖ్య 100 దాటింది. గత రాత్రి 30 మంది వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలుస్తుంది. అందులో దాదాపు సగానికి పైగా డిస్చార్జ్ ఆయారు. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీరసం, వాంతులు విరోచనాలతో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కొత్త రాజరాజేశ్వరిపేటలోనే మొత్తం మూడు వార్డులుగా ఏర్పాటు చేసి వార్డుకు ఆరు నుంచి ఏడు బెడ్ల వరకు కూడా ఏర్పాటు చేసి.. అంటే దాదాపు 20 బెడ్ల వరకు కూడా అందుబాటులో ఉండేలాగా స్థానికంగా ఏర్పాటు చేసారు అధికారులు.
MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసు.. నేటితో ముగియనున్న రిమాండ్.. బెయిల్ వస్తుందా?
మరోవైపు మందులు కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచి బాధితులకు వెంట వెంటనే మెడిసిన్ అందించేందుకు కూడా ఏర్పాటులు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 34 బెడ్లతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వార్డును కూడా 24 బెడ్లతో ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఇంకా ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ఏరియాలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అనేది కూడా పరిశీలించడానికి స్థానికంగా కూడా సర్వే చేస్తున్నారు అధికారులు.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అల్ప పీడనం ఏర్పడే అవకాశం!
అదేవిధంగా ఆ ఏరియాకి ఏ వాటర్ ట్యాంక్ నుంచి అయితే నీళ్లు వెళ్తాయో ఆ దాని నుంచే కొత్త పాత రాజరాజేశ్వరిపేటకి ఈ పరిస్థితి రావడంతో సర్వే చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద కచ్చితంగా ఈ పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక పక్కన బాధితల సంఖ్య అయితే వరసగా పెరుగుతూ వస్తున్నా అందుకు తగ్గ సేవలు అందించిస్తున్నారు. పెరుగుతున్నటువంటి బాధ్యతలకి ట్రీట్మెంట్ అందించడంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామనియతే వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే, మరికొద్ది సేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించి, బాధ్యతలను పరామర్శిస్తారనియతే కూడా తెలుస్తుంది.
