Site icon NTV Telugu

Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధురంధర్’.. ఆ 10 నిముషాలు రిమూవ్

Dhurandhar

Dhurandhar

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రచ్చ చేసేందుకు వచ్చేసింది. సంచలన దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్.. ఆందోళనలో ఫ్యాన్స్

థియేటర్లలో చూసిన సినిమా కంటే ఓటీటీ వెర్షన్ మరింత ప్రత్యేకంగా ఉండబోతోందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశకలిగించింది నెట్ ఫ్లిక్స్. థియేట్రికల్ వెర్షన్  3 గంటల 34 నిముషాలు ఉంటే నెట్ ఫ్లిక్స్ లో 3 గంటల 25 నిముషాలు మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. మొత్తంగా 10 నిమిషాల నిడివి తగ్గించింది నెట్ ఫ్లిక్స్. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, డిజిటల్ ప్రీమియర్ కు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ధురంధర్’, ఓటీటీ ప్రపంచంలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version