Dhootha : నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ‘దూత’ వెబ్ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య తాజాగా ‘దూత’ వెబ్ సిరీస్‍తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.. చైతూ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే.సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా దూత వెబ్ సిరీస్‍ను రూపొందించారు దర్శకుడు విక్రమ్ కే కుమార్. మొత్తంగా 8 ఎపిసోడ్లు తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 30 న స్ట్రీమింగ్‍కు వచ్చింది.దూత వెబ్ సిరీస్‍కు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండటంతో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లోనూ దూత సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
దూత సిరీస్‍కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ ట్రెండింగ్ లిస్టులో టాప్‍కు వచ్చేసింది. దీంతో నాగచైతన్య కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “ఇంతకంటే మంచి స్టార్ట్ ఉండదు. దూత.. ఇండియాలో నంబర్ 1. థాంక్యూ” అని చైతూ ట్వీట్ చేశారు. ప్రైమ్ వీడియో టాప్-10లో దూత నంబర్.1లో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సిరీస్ లో నాగచైతన్య యాక్టింగ్ అలాగే విక్రమ్ కే కుమార్ టేకింగ్, ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.దూత వెబ్ సిరీస్‍లో నాగ చైతన్యతో పాటు ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువత్తు, ప్రాచీ దేశాయ్, రఘు కుంచె, అనిశ్ కురువిళ్ల మరియు రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహించారు. శరత్ మరార్ ఈ సిరీస్ కి మరో నిర్మాతగా ఉన్నారు. ఈ సిరీస్‍కు ఇషాన్ చాబ్రా మ్యూజిక్ అందించారు.దూత వెబ్ సిరీస్‍కు దాదాపు రివ్యూలన్నీ పాజిటివ్‍గా రావడంతో ఈ సిరీస్‍కు మంచి ఆదరణ లభిస్తుంది.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
https://twitter.com/chay_akkineni/status/1730792895371002027
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!