Dheera Trailer:ఆసక్తికరంగా లక్ష్ చదలవాడ ‘ధీర’ ట్రైలర్.. డైలాగులు అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో మాస్ హీరోగా లక్ష్ చదలవాడ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధీర’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.
ధీర గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు హైలెట్ అవుతున్నాయి. ‘ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు అది వెరీ డేంజరస్’.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘రాజ్ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే.. రథం నడిపే కృష్ణుడితో పాటు.. యుద్దం చేసే రాముడు రావాలి.. ఎవడైనా ఉంటాడా?’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడం అదిరిపోయింది. వాడి పేరు రణధీర్.. 6’2 ఉంటాడు.. అని హీరోని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
Also Read
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
‘నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు’ అని హీరో చెప్పే డైలాగ్.. ‘ఐ లవ్యూ మనీషా’.. ‘ఐ లవ్యూ అమృతా’.. అంటూ హీరో రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. ‘ఇప్పటి దాకా లవ్ స్టోరీ చూశావ్.. ఇప్పుడు యాక్షన్ మూవీ చూపిస్తా’.. అంటూ హీరో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు. ‘ వాడు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూకంపం తరువాత భూమిలా ఉంటుంది’.. అంటూ హీరో గురించి అద్భుతంగా ఎలివేట్ చేశారు. ‘నేను యుద్దం చేయడం ఏంట్రా.. యుద్దమే మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ వస్తోంది.. రూ. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు చేరింది..’ అంటూ చివరి డైలాగ్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు
సాంకేతిక బృందం
సమర్పణ: చదలవాడ బ్రదర్స్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర
నిర్మాత: పద్మావతి చదలవాడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ
ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
ఎడిటర్: వినయ్ రామస్వామి
రచన మరియు దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!