Captain Miller : ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్‌గా 100 కోట్లకుపైగా గ్రాస్‌ను, 45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమాపై ఉన్న బజ్ కారణంగా రెండు వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ధనుష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.తమిళంలో వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజవ్వగా…కేవలం కోటి వరకు మాత్రమే వసూళ్లు రాబట్టింది.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా సాగక పోడమే ఈ మూవీ పరాజాయానికి కారణంగా తెలుస్తుంది..
అయితే తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ ఓటీటీ వెర్షన్ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నట్లు సమాచారం.కెప్టెన్ మిల్లర్ సినిమాలో అగ్నీశ్వర అలియాస్ అగ్నిఅనే పాత్రలో ధనుష్ నటించాడు. ఊరిలో కులవివక్షను భరించలేక బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరిన అగ్ని అక్కడి నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు. అగ్నిని చంపాలని బ్రిటీష్ సైన్యం ఎందుకు ప్రయత్నించింది..కుల వివక్షతో పాటు తన ఊరిలోని గుడి కోసం అగ్ని ఎలాంటి పోరాటం సాగించాడు అనే కథతో కెప్టెన్ మిల్లర్ సినిమాను డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించారు..కెప్టెన్ మిల్లర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్‌కిషన్ గెస్ట్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్మోహన్ మరియు మాళవికా సతీషన్ హీరోయిన్లుగా నటించారు.
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!