NTV Telugu Site icon

Air Asia: ఎయిర్ ఏసియాకు రూ.20 లక్షలు ఫైన్..కారణమిదే!

1

1

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియాకు భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) షాకిచ్చింది. రూ.20 లక్షలు జరిమనా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం పైలెట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేపుడు కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాలి. కానీ ఎయిర్ ఏసియా యాజమాన్యం ఆ నిబంధనల్ని పాటించడంలో విఫలమైనందుకు ఈ ఫైన్ విధించింది.

Also Read: Domestic Flight : ఆ గ్రామంలో ఇంటికో ఫ్లైట్ ఉంటుంది

డీజీసీఏ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ విభాగాధిపతిని మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. అలాగే ఎనిమిది మంది సూపర్ వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ ఏసియా మేనేజర్‌కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనల పాటించకుండా అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరీశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Also Read: Health Tips: భోజనం చేసిన తర్వాత నడకతో లాభం..! నిజమెంత..?

Show comments