NTV Telugu Site icon

Devara : భారీ లాభాలతో దూసుకుపోతున్న ‘దేవర’

Devara 2

Devara 2

Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుతూ చేసిన సినిమా దేవర. సోలోగా ఆరేళ్లు, ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లకు వచ్చిన సినిమా కావడంతో.. దేవర కలెక్షన్ల వర్షం కురిపించింది. నార్త్ , సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కుమ్మేస్తోంది దేవర పార్ట్ 1. ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి లాభాల బాట పట్టింది. అంతేకాదు.. లాభాల పరంగా ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచిందని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 50 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్‌ను అందుకుని.. ఎన్టీఆర్ కెరీర్‌లో హైయెస్ట్ లాభాలు తెచ్చిపెట్టిన వన్ ఆఫ్ ది ఫిల్మ్‌గా దేవర నిలిచింది.

Read Also:Pakistan: పాకిస్థాన్లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..

తారక్ కెరీర్లో ఇదొక రికార్డ్‌గా చెబుతున్నారు. దాదాపు 180 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న దేవర.. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా పది రోజులకు గాను 466 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్ల చేరువలో ఉంది. దసరా సెలవులు మరో మూడు రోజులు ఉండటంతో ఈ సినిమా మరిన్ని లాభాలను తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఇక దేవరకు తొలి నుంచి అండగా నిలిచిన ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులిపేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మరో రికార్డ్ అందుకున్నాడు తారక్. నార్త్ అమెరికాలో 6 మిలియన్స్ మార్క్‌ను మరోసారి దాటేశాడు. గతంలో ఆర్ఆర్ఆర్‌ ద్వారా ఒకసారి ఈ ఘనత సాధించిన టైగర్.. ఇప్పుడు దేవరతో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

Read Also:AP Government: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌.. తక్కువ ధరకే వంట నూనె..

Show comments