మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.
Read Also : NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయనున్నారు.ఈ ఫస్ట్ సింగల్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు .తన మాస్ బీట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించే అనిరుద్ అసలైన మాస్ హీరోకి ఏ రేంజ్ లో ఇచ్చాడో అని ఫ్యాన్స్ చర్చించుకున్నారు .అయితే దేవర టీం మాత్రం ఫస్ట్ సింగల్ తో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది .ఈ సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ డాన్స్ తో రచ్చ చేయనున్నట్లు సమాచారం.
