NTV Telugu Site icon

Devara : దర్శకుడు కొరటాలకు అదిరిపోయే సర్ప్రైస్ ఇచ్చిన దేవర టీం..!!

Whatsapp Image 2023 06 15 At 10.31.19 Pm

Whatsapp Image 2023 06 15 At 10.31.19 Pm

తెలుగు ఇండస్ట్రీలో ని టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ కూడా ఒకరు.. ఈయన అందరి కంటే ఎంతో డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధించాడు..కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పాలి.. చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా కూడా అనుకున్నారు. కానీ భారీ ప్లాప్ గా మిగిలింది.వరుసగా విజయాలు మాత్రమే అందుకుంటున్న కొరటాలకు ఈ సినిమా ఊహించని షాక్ ను ఇచ్చింది. ఆచార్య విషయం లో ఎదో తప్పు జరిగింది.ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి .. అందుకే ఈ సినిమాకు జరిగిన విధంగా తన తర్వాత సినిమాకు జరగకుండా పూర్తి గా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

ఆచార్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకుని అప్పుడు ఈ సినిమా లాంచ్ చేసారు. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చారు.. ఈ రోజు కొరటాల శివ తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు బర్త్ డే విషెష్ చెబుతూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు..దేవర టీమ్ కొరటాల శివ ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెష్ ను తెలిపారు.. ఇక ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తుంది… శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే… ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని సమాచారం.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం..