NTV Telugu Site icon

Koratala Siva : మాస్ డైరెక్టర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన దేవర టీం..

Koratala Shiva

Koratala Shiva

Koratala Siva : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మొదటి పార్ట్ ను మేకర్స్ ముందుగా అక్టోబర్ 10 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.తాజాగా ఈ మూవీని అనుకున్న తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

Read Also :Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్.

ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా వుంటాయని తెలుస్తుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే నేడు దర్శకుడు కొరటాల శివ పుట్టిన రోజు సందర్భంగా దేవర మూవీ టీం స్పెషల్ విషెస్ తెలియజేసింది.జీనియస్ డైరెక్టర్ కొరటాల శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .అతని అసామాన్య విజన్ కోసం సిద్ధంగా వుండండి అది దేవర సినిమాను భారతీయ చలన చిత్రంలో ఓ భారీ తుఫాన్ గా మారుస్తుంది అని ట్వీట్ చేస్తూ స్పెషల్ వీడియో ను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ గా మారింది.

Show comments