NTV Telugu Site icon

Devara : ముగింపు దశకు చేరుకున్న దేవర షూటింగ్..?

Devara (2)

Devara (2)

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” .. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Also :Vijay Sethupathi : ఆ సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాను..

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.”ఫియర్ సాంగ్” గా వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.గోవా లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది.అక్కడ కొంత టాకీ పార్ట్ తో పాటు, ఒక సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేక మరో షెడ్యూల్ వుంటుందా అనేది తెలియాల్సి వుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

Show comments