NTV Telugu Site icon

Devara : దేవర రొమాంటిక్ సాంగ్ షూటింగ్ అప్డేట్ వైరల్..

Whatsapp Image 2024 05 17 At 11.41.48 Am

Whatsapp Image 2024 05 17 At 11.41.48 Am

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరక్కుతున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.అలాగే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు..ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఎంతో బిజీ గా వున్నాడు.

అయితే దేవర సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.దీనితో దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు మే 19న దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.దేవర షూటింగ్ అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగునున్నట్లు తెలుస్తుంది.అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేయబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.