NTV Telugu Site icon

Devara Fear Song : దేవరనే డామినేట్ చేసిన అనిరుధ్..

Devara Fear Song

Devara Fear Song

Devara Fear Song : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే దేవర టీం ఈ చిత్రం నుండి ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.”దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత” అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అదిరిపోయే ఎలివేషన్ మ్యూజిక్ తో అనిరుధ్అదరగొట్టాడు. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన లిరిక్ వీడియో మొత్తంలో అనిరుధ్ మాత్రమే ఎక్కువగా కనిపించాడు. ఎన్టీఆర్ వున్న విజువల్స్ చాలా తక్కువగా కనిపించాయి..ఈ సాంగ్ లో ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్ కంటే అనిరుధ్ కి ఇచ్చిన ఎలివేషన్ ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కానీ ఎలివేషన్ సంగతి ఎలా వున్న సాంగ్ సూపర్ గా ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సాంగ్ వింటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Show comments