Site icon NTV Telugu

Rekha Gupta: ఢిల్లీలో సీఎం రేఖ గుప్తాకు తొలి అగ్ని పరీక్ష .. బీజేపీ ప్లాన్ ఏంటి?

Rekha Gupta

Rekha Gupta

Rekha Gupta: ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అగ్ని పరీక్ష ఎదురుకాబోతుంది. దేశ రాజధానిలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ పోరులో బీజేపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన లెఫ్టినెంట్లందరినీ యుద్ధభూమికి మోహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని రేఖ గుప్తా సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం.

READ ALSO: Delhi: భారత్‌పై ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం ప్రభావం !

ఢిల్లీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణపురి, సంగం విహార్-ఎ, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్, షాలిమార్ బాగ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారక-బి, ముండ్కా, నారాయణ, దిచౌన్ కలాన్ స్థానాల పరిధిలో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ 12 MCD సీట్లలో తొమ్మిది స్థానాలు BJP కౌన్సిలర్లకు, మూడు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి షాలిమార్ బాగ్-B, ద్వారకా-B సీట్లపై ఉంది. ఎందుకంటే షాలిమార్ బాగ్-B నుంచి గెలిచిన మాజీ కౌన్సిలర్ రేఖ గుప్తా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ద్వారకా-B నుంచి కౌన్సిలర్ అయిన కమల్జీత్ సెహ్రావత్ లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి BJP MPగా విజయం సాధించారు.

అసలైన పరీక్ష బీజేపీకే..
ఢిల్లీలోని 12 వార్డులకు జరుగుతున్న ఉప ఎన్నికలు బీజేపీకి ఒక పెద్ద పరీక్షగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా షాలిమార్ బాగ్-బి వార్డుకు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహించారు, కానీ ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. అదేవిధంగా ద్వారక-బి వార్డు స్థానం బీజేపీ ఎంపి కమల్‌జీత్ సెహ్రావత్ విజయం సాధించింది. అంతేకాకుండా వినోద్ నగర్ స్థానంలో కమలం పార్టీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి గతంలో గెలుపొందింది. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ తన మొత్తం సైన్యాన్ని మోహరించింది. వాస్తవానికి MCD ఉప ఎన్నికల్లో రేఖా గుప్తా విశ్వసనీయత ప్రమాదంలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇందులో విజయం సాధించడానికి ఢిల్లీ మంత్రులందరినీ వార్డు ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించారని పేర్కొన్నారు. ప్రతి మంత్రికి రెండు వార్డులు కేటాయించారని, బూత్ స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ నిర్వహించడం, ఇంటింటికీ నేరుగా వెళ్లి ఓటర్లను సంప్రదించడం, గెలుపు దిశగా ప్రచార వ్యూహాలను అభివృద్ధి చేయడం వంటి పనులను ఢిల్లీ సీఎం ఇప్పటికే ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయకర్తలకు అప్పగించారని బీజేపీ పేర్కొంది.

ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత సవాలుతో కూడిన సీట్లు పాత ఢిల్లీలోని చాందినీ చౌక్, చాందినీ మహల్. ఎందుకంటే చాందినీ మహల్ గత MCD ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 17,000 ఓట్ల తేడాతో గెలిచింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పార్టీకి తొలి ప్రధాన పరీక్షగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ఈ ఉప ఎన్నిక ఒక గొప్ప అవకాశంగా చెబుతున్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించడం, ఓటర్లతో నేరుగా కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ప్లాన్ చేస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: HAMMER Bomb: ప్రాణాంతక ఆయుధం తయారీకి భారత్ సిద్ధం.. పాక్ గజగజలాడాల్సిందే!

Exit mobile version