NTV Telugu Site icon

Delhi: ట్రాన్స్‌జెండర్స్‌కి కేజ్రీవాల్ శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచితం

Free Buss

Free Buss

ట్రాన్స్‌జెండర్లకు (Transgenders) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుభవార్త చెప్పారు. దేశ రాజధానిలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని (Free Bus ) కల్పిస్తూ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. తాజాగా ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మహిళలకు బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అదే విధంగా ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చని సీఎం తెలిపారు.

ట్రాన్స్‌జెండర్ల కోసం ఏ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అన్ని ప్రభుత్వాలు వాళ్లను విస్మరించాయని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తున్నాయి. ఇంకోవైపు ఉచిత బస్సు ప్రయాణాల వల్ల గిరాకీ తగ్గిపోయాయని.. కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఇది కూడా చదవండి:Girls Missing: ముంబైలో ఐదుగురు బాలికలు మిస్సింగ్.. వెతుకులాటలో పోలీసులు