Site icon NTV Telugu

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!

Mitchell Starc

Mitchell Starc

ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ తాను తిరిగి రావడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యానికి స్టార్క్‌ తెలిపాడు. ఫ్రాంఛైజీ కూడా స్టార్క్‌ నిర్ణయానికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. స్టార్క్‌ తిరిగి రావడంపై ముందు నుంచి సందేహాలు నెలకొన్నాయి. తాజాగా అతడు క్లారిటీ ఇచ్చాడు.

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఐపీఎల్ వాయిదా పడడంతో మిచెల్‌ స్టార్క్‌ స్వదేశానికి (ఆస్ట్రేలియా) వెళ్లిపోయాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో స్టార్క్‌ తిరిగి రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా పేసర్ ఐపీఎల్ ఆడనని స్పష్టం చేశాడు.

Also Read: Nara Lokesh: భారతదేశానికి మొత్తం మనమే విద్యుత్ సరఫరా చేస్తాం!

మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కు శుభవార్త. ఆస్ట్రేలియా పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్‌ ఐపీఎల్ 2025 కోసం తిరిగి రానున్నాడు. మే చివరి వారంలో అతడు భారత్‌కు వస్తున్నట్లు సమాచారం. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీకి హేజిల్‌వుడ్‌ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ చేరువైంది. మరో విజయం సాధిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. మరో ఆసీస్ ఆటగాడు టిమ్ డేవిడ్ ఇప్పటికే బెంగళూరు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆరుగురు విదేశీ ప్లేయర్స్ ఆర్సీబీకి అందుబాటులో ఉండనున్నారు.

Exit mobile version