NTV Telugu Site icon

Deepika Padukone : దీపికా పదుకొనే బేబీ బంబ్స్ ఫొటోస్ వైరల్..

Deepikaa Padukone (2)

Deepikaa Padukone (2)

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. కలెక్షన్స్ ను కూడా ఓ రేంజులో అందుకున్నాయి. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. దీపికా ప్రగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా దీపికా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

గత కొద్దిరోజులుగా ఆమె ప్రగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారని టాక్.. 2018 లో ఈమె రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కేరీర్ లో బాగా సెటిల్ అయ్యాక పిల్లలను కనాలని అనుకున్నారేమో ఇప్పుడు ఆ ఆమె ప్రగ్నెంట్ అని తెలుస్తుంది..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సామాన్యులతో పాటుగా సెలెబ్రేటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి దీపికా వైట్ లూజ్ షర్ట్ లో వచ్చింది.. ఆ షర్ట్ లో బేబీ బంప్స్ క్లియర్ గా కనిపిస్తుంది. దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ తో కల్కి మూవీ చేస్తుంది.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది..

Show comments