ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పద్దుకొనే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం.. తెలుగులో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ మధ్య దీపికా చేసిన సినిమాలన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూల్ చేశాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు తన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది..
కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది.. ఇక షారుఖ్ స్థానంలో దీపికా కొనసాగుతుందా అనేది తెలియలేదు.. గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు.
ఆమె క్రేజ్ కంపెనీ అభివృద్ధికి ఉపయోగ పడుతుందని ఆ కంపెనీ అధినేత హార్షం వ్యక్తం చేస్తున్నారు.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది.. ఈ రెండు కంపెనీలు దాదాపు ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉన్నాయి..