Site icon NTV Telugu

TG DEECET Results: డీఈఈ సెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Ts Inter Supply Results

Ts Inter Supply Results

తెలంగాణలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్‌ ఫలితాలు జూన్‌ 5న విడుదలయ్యాయి. 2025 – 27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు 77.54% మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. 43,615 మంది దరఖాస్తు చేయగా 33,821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 26 వేల 442 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 78.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:TG DEECET Results: డీఈఈ సెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

తెలుగు మీడియంలో తక్కల్లపల్లి హారిక 77 మార్కులు సాధించి టాప్ లో నిలిచింది. ఇంగ్లీష్ మీడియంలో పసునూరి అభినవ్ రెడ్డి 87 మార్కులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉర్దూ మీడియంలో ఫరాజ్ అహ్మద్ 67 మార్కులతో టాప్ లో నిలిచాడు. ఓసీ, బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ ఉండవు.

Exit mobile version