December 2026 Wedding Dates: డిసెంబర్‌లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్

December 2026 Wedding Dates

December 2026 Wedding Dates

December 2026 Wedding Dates: దేశవ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.. ఇక, పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి డిసెంబర్ నెల కీలకం కానుంది. ఈ నెలలో వివాహాలకు కేవలం ఏడు శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి. డిసెంబర్ 16 నుంచి ఖర్మాస్ ప్రారంభం కానుండటంతో ఆ తర్వాత వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించిన వారు శుభ ముహూర్తాలను ముందుగానే ఖరారు చేసుకోవడం మంచిది. రానున్న 23 రోజుల వ్యవధిలో లక్షల ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగుతాయని ఓ అంచనా ఉంది.. ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 15వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయట.. ఆయా కుటుంబాలు.. షాపింగ్‌లు, ఫొటో షూట్‌లు, విందులు, వినోదాలతో సందడిగా ఉండనున్నాయి.

డిసెంబర్ 2026లో వివాహ శుభ ముహూర్తాలు ఇవే!
హిందూ సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి తేదీని నిర్ణయించే ముందు శుభ ముహూర్తం, తిథి, నక్షత్రం వంటి అంశాలను పరిశీలిస్తారు. శుభ సమయంలో వివాహం చేసుకుంటే దంపతుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులు పంచాంగాన్ని సంప్రదిస్తుంటారు.

2026 డిసెంబర్‌లో వివాహాలకు మొత్తం ఏడు శుభ ముహూర్తాలు ఉన్నాయి.

* డిసెంబర్ 2 – బుధవారం

* డిసెంబర్ 3 – గురువారం

* డిసెంబర్ 4 – శుక్రవారం

* డిసెంబర్ 5 – శనివారం

* డిసెంబర్ 6 – ఆదివారం

* డిసెంబర్ 11 – శుక్రవారం

* డిసెంబర్ 12 – శనివారం

ఈ తేదీల్లో వివాహాలు జరిపించుకోవచ్చని పంచాంగ వివరాలు చెబుతున్నాయి. అయితే పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేసుకునే ముందు స్థానిక పంచాంగం, జ్యోతిష్యుల సూచనలు తప్పనిసరిగా చూసుకోవాలి.. తీసుకోవాలి.

డిసెంబర్ 16 నుంచి ఖర్మాస్ ప్రారంభం
డిసెంబర్‌లో వివాహాలు చేసుకోవాలనుకునేవారు ఖర్మాస్ ప్రారంభ తేదీని కూడా గుర్తుంచుకోవాలి. 2026 డిసెంబర్ 16న ఖర్మాస్ ప్రారంభమవుతుంది. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఖర్మాస్ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, తలనీలాలు సమర్పించడం వంటి శుభకార్యాలు నిర్వహించరు. అందుకే ఈ కాలంలో వివాహ ముహూర్తాలు ఉండవని పండితులు చెబుతారు. 2027 జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా ఖర్మాస్ ముగుస్తుంది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వివాహాలు, ఇతర శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. దీంతో డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న కుటుంబాలు డిసెంబర్ 12వ తేదీలోపు అందుబాటులో ఉన్న శుభ ముహూర్తాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 2026 డిసెంబర్‌లో వివాహాలకు ఏడు శుభ ముహూర్తాలు మాత్రమే ఉండటంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న వారు ముందుగానే తేదీని ఖరారు చేసుకోవడం మంచిది.