NTV Telugu Site icon

Nara Lokesh: డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో మంత్రి లోకేష్ భేటీ!

Lokesh Nara

Lokesh Nara

వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం అందించడంపై సహకారం కావాలన్నారు లోకేష్. పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది తమ లక్ష్యం అని.. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని ఎఐ ఎనేబుల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతామన్నారు.

యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ రూపొదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని మంత్రి నారా లోకేష్ వివరించారు. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌గా ఏపీని నిలిపేందుకు స్తూల లక్ష్యాలతో బెంచి మార్కులను నిర్ణయించామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్ తరపున సహకారం అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించమని కోరారు. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలన్నారు. క్యాన్సర్, డయాబిటిక్ రెటినోపతి వంటి వ్యాధల నిర్థారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్‌లలో ఎఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని లోకేష్ కోరారు. ఏపీలో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.