NTV Telugu Site icon

David Miller Marriage: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ మిల్లర్.. ఫొటోస్ వైరల్!

David Miller Marriage

David Miller Marriage

David Miller marries his girlfriend Camilla Harris: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కెమిల్లా హారిస్‌ను మిల్లర్‌ ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మిల్లర్‌, కెమిల్లాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కెమిల్లా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కెమిల్లా షేర్‌ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేప్ టౌన్ వేదికగా జరిగిన డేవిడ్ మిల్లర్, కెమిల్లా హారిస్‌ల వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ 2023 ఆగస్ట్‌లో జరిగింది. కెమిల్లా ఓ బిజినెస్ రన్ చేస్తున్నారు. మిల్లర్, కెమిల్లా వివాహానికి కొద్ది మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. త్వరలో మిల్లర్ ఐపీఎల్ 2024 కోసం భారత్ రానున్నాడు.

Also Read: Oscar Awards 2024: ఉత్తమ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’.. ఉత్తమ నటి ‘ఎమ్మా స్టోన్‌’! విజేతల పూర్తి జాబితా ఇదే

దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్‌ మిల్లర్‌ కీలక ఆటగాడిగా ఉన్నాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు, 116 టీ20లు ఆడాడు. వన్డేల్లో 4458 పరుగులు, టీ20ల్లో 2270 పరుగులు చేశాడు. మొత్తంగా 8 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు మిల్లర్‌ బాదాడు. ఇక 121 ఐపీఎల్ మ్యాచులలో 2714 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో మిల్లర్‌ కీలక పాత్ర పోషించాడు.

 

Show comments