NTV Telugu Site icon

Damodar Raja Narasimha: సంగారెడ్డి లో దామోదర రాజనర్సింహ రెండో రోజు పర్యటన..

Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రతి తరానికి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి 6 హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజాపరిపాలన సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.

Read also: Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!

అభయ హస్తంలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అనివార్య కారణాల వల్ల ఈరోజు దరఖాస్తు చేసుకోలేని లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో సమర్పించవచ్చని తెలిపారు. ఈ నెల 6వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చునని తెలిపారు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని ఇప్పటికే నెరవేర్చామని, పరిమితిని రూ. ఆరోగ్యశ్రీలో 10 లక్షలు. 100 రోజుల్లో అర్హులైన వారికి 6 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 95 శాతం మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని, వారి కష్టాలు, సుఖాల్లో అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Pakistan: బంగాళదుంపలు కిలో రూ.77.. బెండకాయ రూ.450… వెల్లుల్లి కొంటే జేబు ఖాళీ!