Site icon NTV Telugu

Driver Murder Case: డెడ్‌బాడీ డోర్‌డెలివరీ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు కీలక ఆదేశాలు..

Mlc

Mlc

కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్‌ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్‌ డెలివరీ చేశారన్న నేర ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దళిత యువకుడి హత్య కేసు తదుపరి విచారణకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 90 రోజులలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్ లో కేసు రీ ఎంక్వైరీ మొదలైంది. ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది.

READ MORE: Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి 52 లక్షలకు పైగా పేర్లు తొలగింపు..

2022 మే 19న రాత్రి అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య తానే చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు.

READ MORE: Minister Anagani: రోజాతో పాటు వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు..

Exit mobile version