NTV Telugu Site icon

Daksha Nagarkar : హాస్పిటల్లో చేరిన హీరోయిన్..కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..

Daksha

Daksha

ఈ మధ్య కాలంలో సినీ హీరోయిన్లు పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. కొందరు అరుదైన వ్యాధులతో భాధపడుతున్నారు.. స్టార్ హీరోయిన్ సమంత మయో సైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో హీరోయిన్ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుంటుంది.. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ముంబై ముద్దుగుమ్మ దక్ష నగార్కర్ తెలుగులో సినిమాలు చేస్తుంది. వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.. ఆ ఫోటోలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అధికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్ లో.. నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం బాధగా ఉంది. రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను.. నన్ను ఇష్ట పడేవాళ్లు అంతా నాకు తోడుగా ఉంటున్నారు.. వాళ్ళ ప్రేమ ఉన్నంతవరకు నాకు ఏం కాదు.. చాలా బాగుంటాను.. ప్రస్తుతం బాగానే ఉన్నాను.. అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.. దీన్ని బట్టి ఆమెకు ఏదో సర్జరీ అయిందని తెలుస్తుంది.. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు..

Show comments