NTV Telugu Site icon

రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలు…

ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో కోటి 20 లక్షల మోసం చేసారు. ఇదే తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న  ముఠాను అరెస్ట్ చేసారు చత్తీస్గడ్ పోలీసులు. హైదరాబాద్ పలు కేసుల్లో ఉన్న వీరిని  పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకువచ్చి.. కోర్టులో పరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు

ఇక అదే విధంగా కేవైసి ఓటిపి పేరుతో 30 లక్షల మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అధికారులమంటూ.. అకౌంటు హోల్డర్ లను మోసం చేస్తున్న  ముఠాను అరెస్టు చేసారు జార్ఖండ్ పోలీసులు. జార్ఖండ్ లోని జామ్ తార జిల్లా కు చెందిన ఆరు మంది ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. వారిపై హైదరాబాద్ లో సైతం కేసులు నమోదు అవడంతో.. రాంచి జైలు నుండి పీటీ వారెంట్పై హైదరాబాదుకు తీసుకొచ్చి  కోర్టు లో హాజరు పరచారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.