Site icon NTV Telugu

CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

Ayush

Ayush

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 3) జరుగుతున్న 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. పంజాబ్ కు 210 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.

రెండో ఓవర్‌లోనే సంజు సామ్సన్‌ను కోల్పోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో సంజు 7 పరుగుల వద్ద కీపర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. అక్కడి నుండి, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంలో ఆయుష్ 29 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసి భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు. రుతురాజ్ 22 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత, విజయకుమార్ వైశాఖ్ క్యాచ్ పట్టడంతో ఆయుష్ మాత్రే వికెట్‌ను కోల్పోయాడు. ఆయుష్ 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో సహా 73 పరుగులు చేశాడు. కార్తిక్ శర్మ (1 పరుగు) మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Exit mobile version