NTV Telugu Site icon

ODI WC 2023: ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ దేశమే అంటున్న గవాస్కర్

Sunil Gavskar

Sunil Gavskar

క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచ కప్ ప్రారభం కాబోతోంది. ఈ వేడుకకు భారత్ వేదిక కాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ – న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో తలపడనున్నాయి. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో కమిన్స్ సేనతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా జరగనుంది. ఇక ఈ రోజు టీమిండియా తన తొలి వార్మప్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది గువహటిలో జరగనుంది.

Also Read: Beauty tips: అందంగా ఉండాలి అనుకుంటున్నారా ఈ జ్యూస్ తాగండి..

ఇక ఈసారి వరల్డ్ కప్ ఆడే జట్లలో అన్నీ  స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అందుకే ఎవరు కప్ కొడతారు అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఇక మన ఇండియన్స్ అయితే మన వాళ్లే కప్ కొడతారని గట్టి ధీమాతో ఉన్నారు. ఎందుకంటే ఆసియా కప్ తో పాటు, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరించింది. దీంతో ఈసారి కప్ మనదే అంటూ మనోళ్లు ఫిక్స్ అయిపోతున్నారు.

అయితే వరల్డ్ కప్ ఈసారి ఎవరిని వరిస్తుందో జోస్యం చెప్పారు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఆయన ఇండియా పేరునో, పాకిస్తాన్, ఆస్ట్రేలియా పేరును ఆయన చెప్పలేదు. ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఎందుకంటే  ఇంగ్లండ్ జట్టులో టెర్రిఫిక్ బౌలింగ్ లైనప్ ఉందని… గేమ్ ను సమూలం మార్చేయగల ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లు ఉన్నారని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కూడా ఇంగ్లండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పిన గవాస్కర్ వరుసగా రెండో సారి ప్రపంచ కప్ ను గెలుచుకోబోతున్నది ఇంగ్లాండే అంటూ జోస్యం చెప్పారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ సమరంలో ఎవరు గెలవబోతున్నారో అన్నది తెలియనుంది.