NTV Telugu Site icon

Hemant Soren: హేమంత్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్ని రోజులంటే..!

Ed

Ed

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టు ఈడీ కస్టడీ పొడిగించింది (ED). మనీలాండరింగ్ కేసులో ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఇప్పటికే ఐదు రోజుల పాటు హేమంత్‌ను ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. తాజాగా మరోసారి ఈడీ అభ్యర్థన మేరకు ఇంకో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగించింది.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్‌ను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు బుధవారం ఐదు రోజుల పాటు పొడిగించినట్లు న్యాయవాదులు తెలిపారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో చంపయ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అంతకముందు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో ఓ రిసార్ట్‌లో భద్రపరిచారు. ఫ్లోర్ టెస్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే బుధవారం హేమంత్ సోరెన్-కల్పనా సోరెన్ (Kalpana Soran) పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి భావోద్వేగమైన పోస్టును ఎక్స్‌లో పోస్టు చేసింది.