Site icon NTV Telugu

Viral : పెళ్లిలోనే ఇలా కొట్టుకుంటే జీవితాంతం వీళ్లేం కలిసుంటారు

Marriage

Marriage

Viral : ఎవరి జీవితంలోనైనా వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చాలా ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఏదో ఒక అంశం ఆ వేడుక తర్వాత చర్చనీయాంశంగా మారుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో పెళ్లి సందర్భంలో జరిగే వింతలు వైరల్ అవుతున్నాయి. వినోదం లేకుండా ఏ పెళ్లి పూర్తి కాదు. కొన్ని నవ్వు తెప్పించే వీడియోలను చూపి నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకపోతే ఇక్కడ వధూవరులు ఒకరితో ఒకరు బీభత్సంగా పోట్లాడుకుంటుంటారు. చుట్టూ నిలబడి ఉన్నవారు ఈ ఘటన చూసి ఆశ్చర్యపోతున్నారు.

Read Also : Rajastan : భార్య తీరుపై అనుమానంతో భర్త షాకింగ్ డెసిషన్

ఈ షాకింగ్ వీడియోలో పెళ్లికొడుకు పెళ్లి కుమార్తెకు స్వీట్లు తినిపిస్తాడు. కానీ పెళ్లికూతురికి అర్థం కాలేదు, ఆమె నోరు తెరవదు. దీని తరువాత వరుడు సరదాగా తన వధువు ముఖంపై కొట్టాడు. వీటన్నింటికి వధువు కోపం తెచ్చుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి వధువు కూడా వరుడిపై స్వీట్లు విసిరింది. ఆ తర్వాత వరుడికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య పోరు మొదలవుతుంది. @MehdiShadan అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ రాసే సమయానికి 1.67 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు.

Exit mobile version