NTV Telugu Site icon

Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్

Jaggareddy

Jaggareddy

Jaggareddy: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ కీలక నేతలు సోనియా బర్త్‌డే వేడుకలను కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగ్గారెడ్డి నానా హంగామా చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం పోతురాజులతో కలిసి జగ్గారెడ్డి మాస్‌ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. పోతురాజుల కొరడా పట్టుకుని జగ్గారెడ్డి కాసేపు చిందులు వేశారు. జగ్గారెడ్డి డ్యాన్స్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సోనియా బర్త్‌డే వేడుకల్లో పాల్గొని మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

Read Also: Group-2 Hall Tickets: గ్రూప్‌-2 హాల్‌ టికెట్లు విడుదల

అనంతరం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల మాటలను విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పట్టం కట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయ్యిందని. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించారు. రైతు రుణమాఫీ హామీ కూడా దాదాపుగా పూర్తయ్యిందన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ కూడా అమలవుతోందన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాందీ మాట ఇస్తే తప్పే వ్యక్తులు కారన్నారు. ఒక రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకున్నారన్నారు.

Show comments