Site icon NTV Telugu

Congress: ఏపీ మంత్రి నారా లోకేష్‌ను రహస్యంగా కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Ktr

Ktr

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. కేటీఆర్.. ఇటీవల పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతల్ని కలిశారని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము బనకచర్ల కోసం కోట్లాడుతుంటే.. కేటీఆర్ నారా లోకేష్‌తో రహస్య మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్.. నారా లోకేష్‌ను రెండు సార్లు కలిశారని ఆరోపించారు.. ఎందుకు కలిశావు చెప్పు కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. లోకేష్ తో సీక్రెట్ మీటింగ్ ఎందుకు..? అని నిలదీశారు. కేటీఆర్ స్పందించాలని.. తప్పు అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానన్నారు.

READ MORE: Karumuri Nageswara Rao: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది..

Exit mobile version