NTV Telugu Site icon

Puri Jagannadh Temple: ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం.. జనవరి నుంచే అమలు

Puri Jagannath Temple

Puri Jagannath Temple

Puri Jagannadh : 13వ శతాబ్దానికి చెందిన దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయం. ఈ మందిరంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ గురువారం తెలిపింది. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

Read Also: Worlds Shortest Man: ప్రపంచంలోనే పొట్టి మనిషి.. అతడి హైట్ ఎంతో తెలుసా

ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.

Read Also: Astrology: డిసెంబర్‌ 16, శుక్రవారం దినఫలాలు

పూరీ జగన్నాథ స్వామి దేవాలయం బంగాళాఖాతం తీరాన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60కిమీ దూరంలో ఉంది. ఇక్కడ పూరీ జగన్నాథుడు సోదరీ సోదర సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 44 కి.మీ. దూరంలో పూరి పట్టణం ఉంది. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.