NTV Telugu Site icon

North India – Cold: ఉత్తరాది ‘వణుకు’తోంది… ఎందుకో తెలుసా..?

New Project (59)

New Project (59)

North India – Cold: దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చిన పక్క మనిషి కనిపించని మంచు దుప్పటి పరుచుకుంటోంది.ఓ వైపు చల్లని గాలులు , మరో వైపు దట్టమైన పొగమంచుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఆదివారం తెల్లవారుజామున సఫ్దర్‌జంగ్‌లో 5.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Read Also: Death Celebrations:చావు సెలబ్రేషన్స్ ముందే ప్లాన్ చేసుకున్న మహిళ

మధ్య దేశాల నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు శీతాకాల పరిస్థితులతో ఉత్తర భారతంలో సాధారణంగానే చలి తీవ్రంగా ఉంటుంది. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.రాత్రి ఉష్ణోగ్రతలు ఏ రోజు కా రోజు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు,పొగమంచు వాతావరణం నెలకొంది.

Read Also: Nora Fatehi: నోరాను గుర్తుపట్టడం కష్టమే తెల్లని జుట్టుతో..

దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దేశ రాజధాని ఢిల్లీ నుండి కొన్ని విమానాలు ఆలస్యం అయ్యాయి.కనీసం 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు.కనుచూపు తక్కువగా ఉండడంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు కూడా ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జనవరి 16 నుండి 18 వరకు మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.