యూపీలోని ఫిరోజాబాద్‌లో కోచింగ్ ఆపరేటర్‌ను అనుమానాస్పద స్థితిలో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తుండ్ల-ఆగ్రా రహదారిలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న అతని కారులో మృతదేహం లభ్యమైంది. తలకు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న.. సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆగ్రాలో కోచింగ్ సెంటర్ నడుపుతున్న ధర్మబీర్ యాదవ్‌గా గుర్తించారు.
Errabelli Dayakar Rao : హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లింది
మృతుడు 12 రోజుల క్రితమే థార్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి తలపై కాల్పులు జరిపినట్లు ఫిరోజాబాద్ ఎస్పీ సర్వేష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఘటనకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో కొందరు అనుమానితులను గుర్తించగా.. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Minister Satyavati Rathod: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
ధర్మబీర్ ఆగ్రాలో కోచింగ్ తరగతులు నిర్వహించేవాడు. శుక్రవారం సాయంత్రం తన థార్ జీపులో ఇంటి నుండి కోచింగ్ సెంటర్‌కు బయలుదేరాడు. కాని అర్థరాత్రి వరకు కోచింగ్ సెంటర్ కు వెళ్లలేదని.. ఇటు ఇంటికి తిరిగి రాకపోవడంతో భయంతో ఉన్న తన సోదరి ఫోన్ చేసింది. అప్పుడు తాను బిజీగా ఉన్నానని చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. అప్పటినుంచి రాత్రి ఒంటిగంట వరకు ఫోన్లు చేస్తూ.. ఉన్నప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఉదయం కాగానే అతడు మృతిచెందినట్లు పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఫిరోజాబాద్ తెలిపారు.